ధనుష్ 'సార్' మూవీ.. టార్గెట్ ఎంతో తెలుసా?
అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. కాగా ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే ధనుష్ నటించిన సార్ సినిమాకి తెలుగులో 5.18 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది అన్నది తెలుస్తుంది. అందుకే తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 33.58 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 34 కోట్ల షేర్ రాబట్టాల్సిందే.
అయితే మిగతా సినిమాల వసూళ్లతో పోల్చి చూస్తే అటు ధనుష్ కి టాలీవుడ్ లో 5 కోట్ల మార్కెట్ అయితే లేదు అన్నది సినీ పండితుల అంచనా. కానీ ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఐదు కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని ధనుష్ అభిమానులు భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అక్కడక్కడ సినిమా యావరేజ్ అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ సినిమా నిర్మాతలకు ఎంత మొత్తంలో లాభాలను తెచ్చి పెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ.