సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏ హీరో లేదా హీరోయిన్ లకైనా స్టార్డమ్ వచ్చిన తర్వాత తమ అభిరుచులకు తగ్గట్టుగా తమకిష్టమైన పాత్రలను ఎంచుకుంటూ ఆ సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఇక తనకి నచ్చిన సినిమా చేసేందుకు వేరే ఆఫర్లను సైతం వదిలేస్తూ ఉంటారు చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు. కథలు పాత్రల విషయంలో ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. ఇక ఇలా ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా మంచి మంచి ఆఫర్లను చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తోంది అని అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .ఇక ఏ సినిమాలో సమంత నటించిన పాటకి ఎంతటి ఆదరణ లభించిందో
మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఆ పాట ఒక ఊపు ఊపేసింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక ఈ యొక్క పాటతో సమంతకి దేశంలోనే ఊహించని క్రేజ్ కూడా దక్కింది. ఈ పాటతో బాలీవుడ్ లో కూడా సమంతకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మయోసైటిస్ అనే ఒక వ్యాధి కారణంగా చాలా రోజుల నుండి ఇంటికి పరిమితమైంది సమంత. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకొని సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉంది ఈ క్రమంలోని ముంబైలో సమంత ఒక ప్లాట్ ని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక ఆ షూటింగ్ కారణంగానే సమంత అక్కడ ప్లాట్ ని కూడా కొనుగోలు చేసిందని సమాచారం. అయితే తాజాగా పుష్పట్టు సినిమాలో నటించాల్సిందిగా
మేకర్స్ సమంతను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఇక దానికి సమంతా తిరస్కరించినట్లు సమాచారం.ఇకపోతే నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో నీ పాటలు మరియు టీజర్ విడుదల ఇప్పటికే మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అయితే గత కొంతకాలం క్రితం ఈ సినిమాలో చేయమని సమంతని చిత్ర బృందం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కానీ సమంత మాత్రం ఈ సినిమా కూడా రిజెక్ట్ చేసిందట.తాజా సమాచారం ప్రకారం సమంతా కమర్షియల్ రెగ్యులర్ పాత్రలను అంగీకరించలేదని తెలుస్తోంది. వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్త కథలు పాత్రలను మాత్రమే చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లోని సినిమాలు చేసి అక్కడే ఫిక్స్ అవ్వాలని చూస్తోందట సమంత..!!