గత కొన్ని నెలలుగా మరుగున పడిపోయిన ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబో మూవీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా పూజా, కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ వేడుకకు భారీ ఎత్తున సినీ సెలబ్రిటీలు రాబోతున్నారు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్, గోవాలో భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారట. మూవీ యూనిట్ ముందు ఈ రెండు లొకేషన్స్ లోనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట.
ఇదిలా ఉంటే తాజాగా 'ఎన్టీఆర్ 30' స్టోరీ ఇదే అంటూ ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమే అయితే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ని కొరటాల శివ డ్యూయల్ రోల్లో చూపించబోతున్నారట. సినిమాలో తండ్రి, కొడుకులుగా కనిపించనున్నారు హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథ ఉంటుందట. అంతేకాదు మాఫియా బ్యాక్ డ్రాప్, సముద్రం పోర్ట్ నేపథ్యంలో సినిమా నడుస్తుందట. ఇక కథ ప్రకారం హీరోకి విలన్ కి మధ్య భీకరమైన ఆధిపత్య పోరు నడుస్తుందట. అందుకే విలన్ గా ఒక స్టార్ హీరో ని తీసుకోవాలనుకుంటున్నాడు డైరెక్టర్. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కోలీవుడ్ స్టార్ విజయ్ వంటి నటుల పేర్లను ఇప్పటికే పరిశీలిస్తున్నారు.
అయితే సినిమాలో తండ్రి, కొడుకుల పాత్రలతో విలన్ కి ఉండే సీన్స్ సినిమాకే మేజర్ హైలెట్ అని అంటున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ తో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల ఈసారి భారీ కం బ్యాక్ ఇవ్వాలని ఈ సినిమా కథని చాలా కసిగా రాసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ 30 ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఊహించని విజువల్ ట్రీట్ గా ఉండబోతుందని సమాచారం. అయితే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించి చాలా కాలమే అయింది. గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమాలో తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశాడు తారక్. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్ 30 లో తండ్రి, కొడుకులుగా అలరించడానికి రెడీ అయ్యాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు...!!