రైటర్ పద్మ భూషణ్.. తగ్గని వసూళ్ల జోరు..!!
రైటర్ పద్మభూషణ్ సినిమా తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే మొదటిరోజు రూ.65 లక్షలు.. రెండవ రోజు రూ.1.1 కోట్లు, మూడవరోజు రూ.1.2 కోట్లు, నాలుగవ రోజు రూ.50 లక్షలు, ఐదవ రోజు రూ.46 లక్షలు, ఆరవ రోజు రూ.35 లక్షలు, ఏడవ రోజు రూ.28 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దాంతో మొదటివారం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సినిమా రూ. 4.5 కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు రెండవ వారం కూడా నిలకడగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయింది ఈ సినిమా..
రెండవ వారం మొదటి రోజు రూ.30 లక్షల షేర్ రెండవ రోజు రూ.35 లక్షల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో సుమారు రూ.5.2 కోట్లు షేర్ వసూల్ చేసింది. ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ చిత్రం ఈ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం ఇదే అని కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో , ముఖ్యంగా అమెరికాలో కూడా భారీగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. గత తొమ్మిది రోజుల్లో ఈ సినిమా అమెరికాలో మొత్తం రూ.మూడు కోట్లకు చేరువలో కలెక్షన్లు రాబట్టింది.