బాలయ్య 109 సినిమా కోసం పోటీపడనున్న ముగ్గురు స్టార్ డైరెక్టర్స్..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలే కాకుండా చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆ సినిమాల సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన అఖండ ,వీరసింహరెడ్డి  రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వచ్చిన విరసింహారెడ్డి తో మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది ఈ సినిమా. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక విడుదలైన మొదటి షో నుండే ఈ సినిమా హిట్ టాక్ రావడంతో మొదటి రోజు నుండే ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. బాలకృష్ణ 108వ సినిమాగా ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఫిక్స్ అయ్యింది అని తెలుస్తోంది. దీంతో పాటు శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణకి కూతురుగా కనిపించబోతుందని గత కొంతకాలంగా వార్తలు సంగతి మన అందరికి తెలిసిందే.ఈ నేపథ్యంలో బాలకృష్ణ 109వ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు పోటీపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి ముందుగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆసక్తిగా ఉన్నాడట. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈసారి పూరీతో సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. దీని అనంతరం బోయపాటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఆఖండ సీక్వెల్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: