RC15: RC ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను లక్షల సంపాదించుకున్న ఈ మెగా హీరో..ప్రస్తుతం వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇంకా అలాగే అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 


ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు వీడియోస్, ఫోటోస్ లీక్ అయ్యి సోషల్ మీడియాని ఒక రేంజిలో షేక్ చేశాయి. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది.ఈ మూవీలో రామ్ చరణ్ పై ఓ భారీ సాంగ్ ని షూట్ చేసేందుకు పనులు ప్రారంభించారని సమాచారం తెలుస్తోంది. ఈ పాట కోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను రప్పిస్తున్నారట. శంకర్ భారీ స్థాయిలో పాటలను షూట్ చేయడంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ వారం చివర్లోనే ఈ పాటకి సంబంధించిన షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి గ్లోబల్ రేంజ్ హిట్ ని అందుకున్న రామ్ చరణ్ ఇక ఈ సినిమాతో కూడా ఇంటర్నేషనల్ రేంజిలో ఓ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవాలని భావుస్తున్నాడు. మరి చూడాలి RC 15 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: