మహేష్ బాబు-రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమా తో తెలుగు సినిమాని ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీయబోతున్నాడు రాజమౌళి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా 10 ఏళ్ల క్రితమే ఖరారు అయింది. కానీ ఇద్దరికీ వేరువేరు కమిట్మెంట్స్ ఉండడంతో ఈ సినిమా కాస్త ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడం మహేష్ బాబు అదృష్టం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి కి ఉన్న క్రేజ్ ఎప్పుడో నేషనల్ లెవెల్ దాటి అంతర్జాయ స్థాయికి ఎదిగింది ఇకనుండి ఆయన సినిమాలని హాలీవుడ్ ఆడియన్స్ సైతం చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు రాజమౌళి సినిమాలో హాలీవుడ్ టాప్ సినిమాలు తో కూడా పోటీ పడతాయి. 

రాజమౌళి ఈ రేంజ్కి ఎదిగిన తర్వాత మహేష్ బాబు తో సినిమా తీస్తున్నాడు. రాజమౌళికి ఇంత క్రేజ్ దక్కిన అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ సినిమా ఊహించని స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇంతకుముందు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుందని ఇదివరకే రాజమౌళి చెప్పాడు.

అంతేకాదు ఈ సినిమా మొత్తం కూడా ఆస్ట్రేలియా ఉంటుందని జూన్ నెలలో ముహూర్తపు కార్యక్రమాలు కూడా ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. అంతేకాదు ఆ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ థీమ్ ఇంకా క్యాస్టింగ్ గురించి కూడా చెప్పబోతున్నారు. అంతేకాదు మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ సైతం ఉండబోతున్నారని అంటున్నారు. సాధారణంగానే తన సినిమాల కోసం భారీగా ఖర్చు పెట్టే అలవాటు ఉన్న రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం మాత్రమే దాదాపు 15 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిర్మాతగా కె ఎస్ రామారావు వ్యవహరించబోతున్నారు.దాదాపు 400 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో ఉండబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: