బుల్లితెర జంటల్లో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాకేష్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతను టీం లో సుజాత లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక వీరిద్దరూ చాలాకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. బుల్లితెరపై న్యూస్ రీడర్గా పరిచయమైన సుజాత ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫేమస్ అయింది. ఆ తర్వాత జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చింది. ఇక జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ స్కిట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. ఆ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది.
మల్లెమాల వారు కూడా అప్పుడప్పుడు ఈ జంటను పాపులర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే మొదట్లో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్పినా వీళ్లు తర్వాత కొన్ని రోజులకు తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. ఇక జబర్దస్త్ వేదికపై హగ్గులు,కిస్సులు ఇచ్చుకోవడంతో వాళ్ళిద్దరూ చెప్పకపోయినా వీళ్ళ మధ్య ప్రేమ ఉందని ఆడియన్స్ అంతా కన్ఫామ్ చేసుకున్నారు. ఇక అందరూ ఊహించినట్టుగానే ఈ బుల్లితెర జంట కూడా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు బుల్లితెర నటినటులతోపాటు జబర్దస్త్ మాజీ జడ్జ్, మంత్రి రోజా కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా రాకింగ్ రాకేష్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. అదేంటంటే రాకేష్ జబర్దస్త్ వచ్చిన కొత్తలో అతను ఓ బుల్లితెర నటిని ప్రేమించాడట. ఆమెకి కూడా మన రాకేష్ అంటే చాలా ఇష్టమట. కాకపోతే ఈ ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. అప్పటినుంచి వారిద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత రాకేష్ కు మన సుజాత పరిచయం కావడం.. అదికాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే రాకింగ్ రాకేష్ ఇదివరకే ఓ బుల్లితెర నటిని ప్రేమించాడనే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం రాకింగ్ రాకేష్, సుజాత జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లలో చేస్తున్నారు...!!