ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ హవా నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన సంగీతాన్ని అందించిన సినిమాలు ఒక సినిమాకి మించి మరొక సినిమా హిట్ అవడంతో ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన విరసింహారెడ్డి సినిమా ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తమన్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాకి సంగీతాన్ని అందించే పనిలో ఉన్నారు.
దాంతోపాటు శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రానున్న ప్లాన్ ఇండియా సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా తమ పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తమ ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడడం ఆయనపై ప్రశంసలు కురిపించడానికి గల కారణం ఏంటి అని ఆరాధిస్తున్న నేపథ్యంలో... గతంలో ఎన్టీఆర్ బృందావనం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రెండు పాటలు కంపోజ్ చేయగా ..వంశీ వాటిని ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది.. అనంతరం ఈ రెండు పాటలు ఆయనకి నచ్చితే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని పెట్టుకుందామని చెప్పుకొచ్చారు..
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు పెద్ద వాల్యూంతో పాటలని ఆయన వింటూ ఉంటారు.. అలా నేను కంపోజ్ చేసిన పాటలను వింటూ మధ్యలోనే ఆపి నా గురించి ఎన్టీఆర్ అడిగి నా గురించి తెలుసుకున్నారు.. దాని తర్వాత నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగిన వెంటనే నేను ఏడ్చేసాను.. కళ్యాణ్ నిండా నీళ్లతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాను.. ఇక ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ నాకు ఫోన్ చేసిన మాట్లాడిన విధానాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. సాధారణంగా అవకాశాల కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం.. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా నన్ను పిలిచి అవకాశం ఇవ్వడం నా జీవితంలో నేను మర్చిపోలేను.. అని ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్..!!