వరుణ్ తేజ్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ అందరూ కూడా ఇప్పుడు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అయితే ఇప్పటికే యంగ్ హీరోస్ అయిన నితిన్, రాణా, నిఖిల్, కార్తికేయ తాజాగా శర్వానంద్ వంటి హీరోలు సైతం వివాహం చేసుకున్నారు. ఇక మిగిలిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోస్ పెళ్లిల కోసం తమ అభిమానులు ఎంతో ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అలా మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వివాహం గురించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేఘాభిమానులు. 

అయితే తాజాగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు వరుణ్ తేజ్ వివాహం పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగబాబు.. ఇక ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు మాట్లాడుతూ... వరుణ్ తేజ్ పెళ్లి విషయాన్ని వరుణ్ తేజ అధికారికంగా ప్రకటిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఆ అమ్మాయి ఎవరనే విషయం నేను చెప్పలేను గానీ.. ఆ విషయాన్ని కూడా వరుణ్ చెప్తాడు. ఆ వివరాలు నేనిప్పుడు చెప్పకూడదు. ఆ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ప్రకటిస్తాడు అంటూ తెలియజేశాడు నాగబాబు. ఇదిలా ఉంటే గతంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు రావడం జరిగింది.

 అంతేకాదు తాజాగా వెంకటేష్ చిన్న కూతురుని కూడా వరుణ్ తేజ్ వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఆ విషయాలపై మాత్రం నాగబాబు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం వరుణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ ప్రవీణ్ శతార్ దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇంటర్వ్యూలో భాగంగా నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయని... ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ కి అప్పులు ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది అంటు చెప్పుకొచ్చాడు నాగబాబు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: