జబర్దస్త్ కి మళ్ళీ వస్తా అంటున్న నాగబాబు.. ఎప్పుడంటే..!?

Anilkumar
గత పది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమౌతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకులను  కడుపుబ్బా నవ్విస్తూ ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది బిల్లుతెర కామెడీ షో జబర్దస్త్. ఈ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ షో కేవలం టాలెంట్ ఉన్నవారికి కాదు సినిమాలో మంచి పేరు తెచ్చుకొని ఆర్థికంగా చతికిల పడ్డ నటినటులకు కూడా ఈ షో బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే ఈ షో మొదలైనప్పటినుండి ఈ షో కి జడ్జ్లుగా నాగబాబు మరియు రోజాలు వ్యహరించిన  సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి వల్లే ఈ షో కి ఇంత ఆదరణ లభించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ షో నుండి నాగబాబు తప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో మల్లెమాల యూనిట్ పై తీవ్ర విమర్శలు కూడా రావడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా నాగబాబు మళ్ళీ జబర్దస్తీ రీ ఎంట్రీ ఇస్తాడు అంటూ రకరకాల వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఇక ఇంటర్వ్యూలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ... నేను వాలంటరీగా బయటకు వచ్చాను.. వాళ్ళు నన్ను రమ్మని అడిగితే అడిగితే కచ్చితంగా మళ్ళీ వస్తాను... కానీ నా అంతట నేను వాళ్ళని వస్తాను అని మాత్రం అడగను.. అంతేకాదు శ్యాం ప్రసాద్ రెడ్డి తో కూడా నాకు ఎటువంటి గొడవలు కూడా లేవు.

గతంలో కొంతమంది స్టాఫ్ ఆటిట్యూడ్ చూపించడం వల్ల చాలామంది కుర్రాలకు అన్యాయం జరిగిందని భావించి నేనే నా అంతట నేను బయటకు వచ్చేసాను అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.. దీంతో నాగబాబు మళ్లీ జబర్దస్త్ కి రియంట్రిస్తే బాగుంటుంది అని ఈ వార్త విన్న చాలా మంది నాగబాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నాగబాబు రియంట్రి ఇస్తాడా లేదా  అన్నది చూడాలి. ఇందులో భాగంగానే నాగబాబు బయటికి వచ్చిన కమెడియన్స్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. నేను బయటికి వచ్చేసానని నాతోపాటు ఎవరిని రమ్మని నేను చెప్పలేదు.. అలాంటి రిస్క్ నేను చెయ్యను.. చంద్ర మరియు ఆర్పి నాతో ఉండాలని వారంతట వారే బయటకు వచ్చేసారు.. బయటికి వచ్చినానంతరం చంద్రం మంచి నటుడు అయ్యాడు.. ఇక ఆర్పి పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను పెట్టుకుని బాగా సక్సెస్ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: