సమంత శాకుంతలం సినిమా మళ్ళీ వాయిదా పడిందా..!?

Anilkumar
టాలీవుడ్  స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఈనెల 17న విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ ని విడుదల చేసిన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతామని ఈ సినిమా దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ తో దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం సినిమా విడుదల వాయిదా పడింది అన్న సమాచారం వినబడుతుంది. అయితే ఎందుకు ముఖ్య కారణం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటిదాకా చిత్ర బంధం మొదలుపెట్టలేదు. ఇదివరకే ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా సినిమా కూడా అంటూ ఈ సినిమా యొక్క దర్శక నిర్మాతలు ప్రకటించడం జరిగింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం ఒక నెలరోజుల ముందు నుండి సినిమా ప్రమోషన్ హడావుడి మొదలవ్వాలి.

కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ కార్యక్రమం కూడా ఇంకా జరగలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడింది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సమంత అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారు. శకుంతలం సినిమా ప్రకటించిన తేదీకే విడుదలవుతుందా లేదా వాయిదా పడిందా అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక సమంత మాత్రం తన అనారోగ్యం కారణంగా ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనే దాఖలు కనిపించడం లేదు. అయితే ఈ కారణంగానే ఈ సినిమాను వాయిదా వేశారు అంటూ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి .ఈ వార్తలపై ఈ సినిమా దర్శక నిర్మాతలు క్లారిటీ ఇస్తే గాని తెలియదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: