లేటెస్ట్ అప్డేట్..నాని దసరా టీజర్ లాంఛ్..!

Divya
నాచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికి సినిమాలో నటించి మరొకసారి విభిన్నమైన క్యారెక్టర్ లను ఎంచుకుంటాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోని ఇప్పుడు ఆయన దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నానికి జోడిగా మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతోంది.
ఎప్పుడూ లేనివిధంగా పక్కా మాస్ క్యారెక్టర్ లో సినిమా చేస్తున్నారు నాని. అయితే ఇలాంటి సినిమా ఇప్పటివరకు నాని కెరియర్లో రాలేదు. అందుకే అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా 2023 మార్చి 30వ తేదీన భారీ స్థాయిలో తెలుగు,  తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టి సినిమాపై మరింత క్రేజ్ పెంచడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే దసరా మూవీ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ టీజర్ ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.  తెలుగులో గ్రాండ్ ఈవెంట్తో రిలీజ్ చేయనుండగా.. తమిళ్లో ధనుష్.. హిందీలో షాహిద్ కపూర్.. మలయాళం లో దుల్కర్ సల్మాన్.. కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ప్రకటన మాత్రం చేయలేదు.  ఈరోజు ఈ దసరా సినిమా టీజర్ ను లాంచ్ చేస్తారా లేక అధికారిక ప్రకటన వదులుతారా అనేది అభిమానులు ఎదురుచూడాల్సిన అంశం .ఏది ఏమైనా నాని ఈసారి దసరా సినిమాతో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: