ఈ ఏడాది మెగాస్టార్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడం.. దాంతోపాటు రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కావడం.. అంతేకాకుండా రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకోవడం.. ఇలా వరుసగా శుభవార్తలను అందిస్తున్నారు మెగా ఫ్యామిలీ. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా కుటుంబంలో మళ్లీ పెళ్లి భాజలు మూగబోతున్నాయి అని తెలుస్తుంది.
యువ హీరో చిరంజీవి తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు లేకపోతున్నాడు అని తెలుస్తుంది. అంతేకాదు వరుణ్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇక వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు హయవాహిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాలు చర్చలు కూడా జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే పెళ్లి కూడా చేయనున్నారట. అంతేకాకుండా త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది.
అయితే గతంలో టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని గతంలో రకరకాల వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని తేలిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు వెంకటేష్ చిన్న కూతురుతో వరుణ్ తేజ్ పెళ్లి అయిన వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన వార్తపై అటు మెగా ఫ్యామిలీ లేదా దగ్గుపాటి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేస్తే గాని ఈ వార్తలు నిజం ఉందా లేదా అన్నది తెలియదు. ఇక ఈ వార్త విన్న మెగా మరియు దగ్గుపాటి అభిమానులు ఈ వార్తపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ..!!