పఠాన్ చిత్రానికి హామీ ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వం..!

Divya
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా వెండితెరపై సందడి చేయకపోవడం అభిమానులకు నిరాశ మిగిల్చిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ బుకింగ్స్ కూడా ఈరోజు నుంచి మొదలయ్యాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ పఠాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకునే దిశగా పరుగులు తీస్తోంది అని ప్రీ బుకింగ్స్ రికార్డ్ చూస్తే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట భేషరమ్ రంగు పాట సినిమాకు కాంట్రవర్సీలతోనే భారీ బస్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో దీపికా పదుకొనే కాషాయపు రంగు బికినీ ధరించడం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది ఇండియన్ సినిమాలలో హీరోయిన్లు ఇలా సినిమాలలో బికినీలు ధరించడం ఖండిస్తూ చాలామంది ప్రేక్షకులు సినిమా విడుదలను అడ్డుకుంటామని పెద్ద ఎత్తున వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాదు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాలోని అసభ్యకర సన్నివేశాలను తొలగించాలని తిప్పి పంపింది. మొన్నటి వరకు కూడా ఈ సినిమా విమర్శలు ఎదుర్కొంది.
ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోని దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ ముఖ్యమైన నగరాలలో సినిమా ప్రమోషన్స్ కై మీడియా ముందుకు వచ్చి మరొకసారి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం కూడా తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ చిత్రానికి రక్షణ కల్పిస్తామని గుజరాత్ ప్రభుత్వం తాజాగా హామీ ఇచ్చింది ఇందుకోసం గుజరాత్ లో భారీగా విడుదలకు  ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: