జగన్ కోరుకుంటే పవన్ పై పోటీకి సిద్ధం అంటున్న అలీ..?
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి అధికారంలోకి రావాలి అని అధికార పార్టీలో ఉన్న వైసిపి వారిని తనదైన మాటల తూటాలతో ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలీ కూడా పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికలలో ప్రచారాలు నిర్వహించిన ఆలీ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా చేసిన కామెంట్లు అప్పుడు అందర్నీ పూర్తిస్థాయిలో ఆశ్చర్యానికి గురిచేసాయి. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆలీ పేరు ఎత్తకుండా పరోక్షంగా కౌంటర్ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది.
మొన్నటికి మొన్న తన కూతురు వివాహానికి స్వయంగా ఆలీ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించగా పవన్ కళ్యాణ్ రాలేదు . దాంతో వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు చాలా వచ్చాయి అంటూ వార్తలు వినిపిస్తుండడంతో ఆలీ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అని.. ఆయన కొన్ని కారణాలవల్ల పెళ్లికి రాలేకపోయానని చెప్పినట్లు కూడా తెలిపారు. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే పవన్ కళ్యాణ్ పై కూడా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు అలీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై అలీ చేసిన ఈ కామెంట్ లు వైరల్ గా మారుతున్నాయి.