విజయ్ తెలుగులో మూవీని ప్రమోట్ చేయడానికి ఇష్టపడడం లేదా..?

Divya
తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న బై లింగ్వల్ చిత్రం వారసుడు.. తమిళ్లో వారిసు పేరిట జనవరి 11వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు వారసుడు సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాతో విజయ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా ? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగులో వారసుడు సినిమాను ప్రమోట్ చేయడానికి ఆయన ముందడుగు వేయలేదు.
చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్న విజయ్.. తెలుగు వారసుడు సినిమా కోసం ఎందుకు తెలుగులో ప్రచారం చేయలేదు అనే వార్తలు కూడా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. నిజానికి తెలుగులో సినిమాను ప్రమోట్ చేయడం అతనికి ఇష్టం లేదా? మరి ఏదైనా కారణమా? అన్న కోణాలలో కూడా అభిమానులు పరిశీలిస్తున్నారు. ఇకపోతే హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ దళపతి తప్పించుకున్నాడు. కేవలం దిల్ రాజు,  రష్మిక మందన మాత్రమే హాజరయ్యారు. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన ఏ ప్రెస్ మీట్ లో కూడా విజయ్ కనిపించకపోవడం పలు సంచలనాలకు దారితీస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ హీరో శ్రీకాంత్,  సీనియర్ నటి జయసుధ కూడా నటించిన విషయం తెలిసిందే.  అయితే తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శరత్ కుమార్ మరియు శ్యామ్ లకు హైదరాబాదుకు వచ్చి ఓపెనింగ్ షోలకు హాజరైనందుకు శ్రీకాంత్ అలాగే జయసుధ వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.  దీన్నిబట్టి చూస్తే శ్రీకాంత్, జయసుధ ఇద్దరూ కూడా ఈ సినిమాలో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే పోషించారు.  కానీ సినిమాను గెలిపించుకోవడం కోసం వారు ప్రమోషన్స్లో పాల్గొన్నారు. మరి విజయ్ ఎందుకు తన సినిమాను ప్రమోట్ చేయడానికి రాలేదు అన్న విషయం మాత్రం ఇప్పటికే సందేహం గానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: