తన తండ్రి లాంటి నటుడు దేశంలోనే లేరంటున్న నారా బ్రాహ్మణి..!

Divya
హైదరాబాదులోని కూకట్ పల్లిలో వీరసింహారెడ్డి సినిమాను నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి తాజాగా తిలకించారు. ఈ క్రమంలోనే తన తండ్రి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. తన తండ్రి లాంటి నటుడు దేశంలోనే లేరు అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీర సింహారెడ్డి సినిమా అద్భుతంగా ఉందని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయని.. నారా బ్రాహ్మణి తెలిపింది. నాన్నలా డైలాగ్స్ చెప్పేవారు.. దేశం లోనే లేరు అని , ప్రేక్షకుల మధ్య సినిమా చూడడం తనకు చాలా ఇష్టమని.. అందులోనూ నాన్న సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది.
ఇకపోతే తన నాన్న సినిమాలు అభిమానుల మధ్య చూడడమే తనకు మరింత ఆనందాన్ని ఇస్తుంది అని నారా బ్రాహ్మణి  తెలిపింది. ఇకపోతే నటసింహం బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని.. అదే జోష్ తో  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైంది.
మొదటి భాగం ప్రేక్షకులను బాగా అలరించింది అని..  రెండవ భాగం ప్రేక్షకులకు బోరు కలిగించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు పోటీగా వాల్తేరు వీరయ్య సినిమా కూడా థియేటర్లలో ఈరోజు ఉదయం విడుదల అయింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నట్లు సమాచారం. ఒకవైపు చిరంజీవి మరొకవైపు బాలకృష్ణ ఇద్దరు కూడా థియేటర్ వద్ద భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. మరి సంక్రాంతి బరిలో ఏ హీరో నెగ్గాడు అనే తెలియాలి అంటే సంక్రాంతి పండుగ పూర్తయి కలెక్షన్స్ తేలే వరకు ఎదురు చూడక తప్పదు. ఏదిఏమైనా మరొకవైపు తన తండ్రి గురించి నారా బ్రాహ్మిని చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: