'అన్ స్టాపబుల్' పవన్ ఎపిసోడ్ కి ఊహించిని ట్విస్ట్..!?

Anilkumar
ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ఏదైనా షో ప్రభంజనం సృష్టిస్తుంది అంటే అది అన్ స్టాపబుల్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ షో కి స్టార్ హీరోలు.. హీరోయిన్లు..రాజకీయ నాయకులు.. డైరెక్టర్లు మరియు చాలామంది అతిధులుగా వస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చిన వారితో బాలయ్య చాలా సరదాగా చిట్ చాట్ చేస్తూ అందరినీ ఎంతగానో అల్లరిస్తున్నాడు. ఈ షో తో బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. బాలయ్య సీరియస్ గా ఉండటమే అందరికీ తెలుసు.కానీ బాలయ్యలో కూడా ఇంత ఫన్ యాంగిల్ఉంది అని ఈ షో ద్వారానే అందరికీ తెలిసింది. 

అంతేకాదు ఈ షో బాలయ్య కెరియర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. సీజన్ వన్ మంచి విజయాన్ని అందుకోవడంతో సీజన్ 2 కూడా ప్రారంభించారు.ఈ సీజన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ రావడం జరిగింది .గత కొద్ది రోజుల క్రితం ఈ షో కి ప్రభాస్ వచ్చి ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాడో మనందరికీ తెలిసిందే. ఇక గత కొద్ది రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి వచ్చాడు. ఇక ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఆ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుంది అని చాలామంది భావించారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎపిసోడ్ ఫిబ్రవరి వరకు స్రీమింగ్ అయ్యే అవకాశాలు లేవు అంటూ తెలుస్తోంది.అయితే అంతేకాకుండా పవన్ ఎపిసోడ్ తో రెండవ సీజన్ కూడా ముగుస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పవన్ ఎపిసోడ్ ని కాస్త లేటుగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.అయితే తాజాగా వీరసింహారెడ్డి టీం తో కూడా ఒక ఎపిసోడ్ని షూట్ చేయడం జరిగింది. ఇక సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ను విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ అనంతరం రామ్ చరణ్ మరియు కేటీఆర్ తో మరొక ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. ఇక ఆ ఎపిసోడ్ కూడా పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని విడుదల చేస్తారట ఆహా టీం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: