టెంపర్ సినిమాలో పోసాని పాత్రకి మొదట ఆయన్ని అనుకున్నారా..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తరికెక్కిన టెంపర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బిజినెస్మేన్ సినిమా తర్వాత మంచి హిట్ లేక పూరీ జగన్నాథ సతమతమవుతున్న సమయంలో ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో పోసాని  నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇక ఎన్టీఆర్ కి మరియు పోసానికి మధ్య జరిగే సన్నివేశాలు ఈ సినిమాకి చాలా హైలెట్గా నిలిచాయి. 

ఇక ఈ సినిమాతో పోసాని కి మంచి గుర్తింపు లభించింది. అయితే మొదటగా ఈ పాత్ర కోసం పోసానిని అనుకోలేదట పూరి జగన్నాథ్.  మొదట ఈ పాత్ర కోసం నారాయణ మూర్తిని అనుకున్నారట.ఆయన కోసమే పూరి జగన్నాథ్ ఈ పాత్రను రాశారట. ఇందులో భాగంగానే ఆ పాత్ర కోసం మూర్తి అని పేరును పెట్టాడట పూరి జగన్నాథ్. అయితే నారాయణమూర్తిని పూరి జగన్నాథ్ ఈ పాత్ర కోసం చేయమని ఎంత ప్రయత్నించినప్పటికీ నారాయణ మూర్తి మాత్రం ఈ పాత్ర చేయడానికి అస్సలు ఇష్టపడలేదట. చివరికి ఎన్టీఆర్ నారాయణమూర్తిని అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని తెలుస్తోంది.

 దీంతో ఆ పాత్ర కోసం పోసానిని సంప్రదించారట పూరి. పాత్ర ఏంటో చెప్పడంతో ఆ పాత్ర చేయడానికి పోసాని సైతం ఒప్పుకున్నారు. అయితే అసలు టెంపర్ సినిమాలో ఆ పాత్రలో నారాయణ మూర్తి ఎందుకు చేయలేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పవచ్చాడు నారాయణమూర్తి ...అయితే నేను ఆ పాత్రలో నటిస్తే సినిమా హిట్ అవుతుంది అనుకొని పూరి జగన్నాథ్ ఆఫర్ నాకు ఇవ్వలేదు.. నాతో ఒక డిఫరెంట్ వేషం వేయించాలని పూరి జగన్నాథ్ భావించాడు.. ఆ క్యారెక్టర్ నాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలని పూరీ జగన్నాథ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంత గొప్ప పాత్రను నాకు పూరి జగన్నాథ్ ఇవ్వాలి అనుకున్నందుకు పూరి జగన్నాథ్ కి థాంక్స్ అంటూ చెప్పవచ్చారు నారాయణమూర్తి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: