తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలలో నటించి కనుమరుగైన హీరోయిన్లలో కామ్నా జెఠ్మలానీ కూడా ఒకరు. దాదాపుగా ఒక దశాబ్దం క్రితం వరకు ఏమి అందచందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఎంతోమంది హీరోల సరసన నటించిన ఈమె అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికి ఏమి కనుమరుగయ్యింది. ఇప్పుడు తాజాగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్లను మించి గ్లామర్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ ఏమి స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది.
అల్లరి నరేష్ తో కలిసి సినిమాలో నటించి తన అంద చందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకున్న కామ్నా జెఠ్మలానీ ఆ తరువాత వెండితెరకు దూరమైంది. కొన్నాళ్ళుగా వరుస సినిమాలు చేసి కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అంతేకాకుండా ఆ వెంటనే ఇద్దరు పిల్లల్ని కనడం కూడా జరగడంతో ఫ్యామిలీ బాధ్యతలు పెరిగిపోయాయి. 2014లో నాగపాల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది కామ్నా జెఠ్మలానీ . ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పటికీ కూడా ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం హీరోయిన్ లకు తీసుకోలేదని చెప్పవచ్చు.
కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఆలోచన ఉంది కాబట్టే ఇప్పటికీ తన ఫిట్నెస్ ని కాపాడుకుంటోంది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను వర్కౌట్ వీడియోలను సైతం తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తన పిల్లలని కాస్త చూసుకుంటూ ఇంటి పని చేసుకోవడంతో బిజీగా గడిపేస్తోందట. తాజాగా కొన్ని ఫోటో షూట్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈమె రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సులువువని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముంబై ముద్దుగుమ్మ అయినప్పటికీ ఎన్నో సూపర్ హిట్ విజయాలలో అందుకుంది. ఇక ఈమె కెరియర్ లో రణం ,సామాన్యుడు ,కత్తి కాంతారావు ,బెండప్పారావు వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.