
కొరటాలను ప్రశ్నిస్తున్న జూనియర్ అభిమానులు !
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ కు ఏర్పడిన పాన్ ఇండియా ఇమేజ్ తో ఒక భారీ సినిమాను వెంటనే చేస్తాడని అతడి అభిమానులు ఆశించారు. అయితే కొరటాల దర్శకత్వంలో జూనియర్ నటిస్తున్న మూవీ ఆమూవీ కథ రెడీ అయ్యే విషయంలో సమస్యలు ఏర్పడటంతో ఆమూవీ ప్రారంభం ఈ ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడటంతో కనీసం ఈమూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా విడుదల అవుతుందని అతడి అభిమానులు భావించారు.
అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీ విడుదల వచ్చే ఏడాది ఏప్రియల్ నెలలో అని తెలియడంతో తారక్ అభిమానులు అంతా దిగాలు పడిపోయారు. అంతేకాదు ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే సినిమాను ఏకంగా 14 నెలలు తీస్తారా అంటూ దర్శకుడు కొరటాల శివ ను జూనియర్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈవిషయంలో అసలు వాస్తవం వేరు అన్నమాటలు వినిపిస్తున్నాయి.
‘ఆచార్య’ ఫెయిల్యూర్ తో షాక్ అయిన కొరటాల జూనియర్ తో తీయబోయే కథ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ కథను అనేకసార్లు మార్పు చేయడం జరిగింది అన్న వార్తలు వచ్చాయి. దీనికితోడు ఈమూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థితులలో బాలీవుడ్ లో ఈమూవీకి క్రేజ్ పెంచడానికి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఒప్పించే విషయంలో కూడ కొరటాల కు చాల సమయం పట్టింది అంటారు. ఇలా రకరకాల కారణాలు వల్ల తారక్ అభిమానుల అసహనాన్ని పట్టించుకోకుండా ఈమూవీని పక్కా ప్లాన్ తో నిర్మిస్తున్నట్లు టాక్..