టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 38 సంవత్సరాలు దాటినప్పటికీ శర్వానంద్ ఇంకా పెళ్లి పీటలు అయితే ఎక్కలేదు. ప్రస్తుతం శర్వానంద్ ఎక్కడికి వెళ్లినా కూడా మొదటగా ఆయనకు పెళ్లి ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2కి గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ శర్వానంద్ ని ముందుగా పెళ్లి ప్రశ్న అడిగాడు.దానికి ఏదో సమాధానాన్ని చెప్పి తప్పించుకున్నాడు శర్వానంద్. ఇదిలా ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు వీరిద్దరి మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారట. అంతేకాదు శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తెలంగాణ అమ్మాయిగా సమాచారం.అయితే వధువుకి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్త విన్న చాలా మంది వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని కూడా అంటున్నారు. శర్వానంద్ కి ఆ అమ్మాయి గత కొంతకాలంగా తెలుసు అని రెడ్డి సామాజిక వర్గం అమ్మాయితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్
పెళ్లికి రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేయడం కారణంగా ప్రస్తుతం ఈమె హైదరాబాదులోనే ఉంటుందట. స్టార్ హీరోగా కాకపోయినా యాక్టర్ గా మొదట చిన్నచిన్న క్యారెక్టర్లలో నటిస్తూ దాని అనంతరం మంచి కథలను ఎంచుకుంటూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు శర్వానంద్.ఇటీవల ఒకే ఒక జీవితం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సితార బ్యానర్ లో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు శర్వానంద్..!!