కొత్త ప్రాజెక్టుపై సైన్ చేసిన విజయ్ దేవరకొండ..!

Divya
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన ఈయన అతి తక్కువ సమయంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఈయన పేరు వినిపించింది.
ఆ తర్వాత గీత గోవిందం,  డియర్ కామ్రేడ్,  నోటా వంటి సినిమాలు చేసి మరింత పాపులారిటీ దక్కించుకున్న  విజయ్ దేవరకొండ ఆ తర్వాత ద్వారకా వంటి సినిమాలు తెరకెక్కించిన అవి డిజాస్టర్ అయ్యాయి.  కానీ ఇతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇదిలా ఉండగా ఇటీవల లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో సైలెంట్ అయిన విజయ్ దేవరకొండ మీడియా ముందు ఎక్కువగా కనిపించలేదు.  ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషి.  ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సమంత మయో సిటీస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె షూటింగ్లో పాల్గొనలేకపోతోంది. దీంతో  సమంత ఆరోగ్యం కుదుట పడేవరకు షూటింగ్ ప్రారంభించబోము అని కూడా చిత్రబృందం ప్రకటించింది.  ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా షూటింగ్ సెట్ లో ఉండగానే విజయ్ దేవరకొండ తన మరొక సినిమాను కన్ఫర్మ్ చేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించినా.. అందులో ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.  కానీ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ అందించారు.  అయితే ఖుషి సినిమా పూర్తి అయిన తర్వాతనే ఈయన సినిమా మొదలు కాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: