వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. !?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయనకి జోడిగా శృతిహాసన్ నటించింది. ఇదిలా ఉంటే ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలక పాత్రలో కేథరిన్  కూడా నటిస్తుంది అన్న వార్తలు గతంలో రావడం జరిగింది. అయితే ఈమె .. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రవితేజ కి జోడిగా చేస్తుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పాటలు ఈ సినిమా టీజర్ మరియు అనేక రకాల పోస్టర్లు కూడా జరిగింది.కానీ ఇప్పటివరకు ఈమెకి సంబంధించిన ఒక్క ఫోటో కానీ విజువల్ కానీ ఎక్కడ కూడా రాలేదు.

దీంతో చాలామంది కేథరిన్ ఈ సినిమాలో ఉందా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కాజల్ నటించినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ పాత్రను తొలగించారు. దీంతో చాలామంది రవితేజ పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువగా ఉండడంతో ఈమె పాత్రను ఈ సినిమా నుండి తొలగించారా అన్న కామెంట్లు సైతం వస్తున్నాయి. ఒకవేళ ఈమె పాత్ర ఈ సినిమాలో చిన్నదే అయినప్పటికీ ఈమెకి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ లో అయినా ఈమెను చూపించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు తనకి సంబంధించిన ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు చిత్ర బృందం.

కనీసం ఇటీవల విడుదలైన టీజర్లలో కూడా ఈమెకు సంబంధించిన ఒక్క ఫోటో గాని ఈమెకు సంబంధించిన ఒక వార్త కూడా బయట రానివ్వట్లేదు చిత్ర బృందం. అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని పాటలు విడుదల కావడం జరిగింది. ఇక ఆ పాటల్లో కేథరిన్ ఎక్కడ కూడా కనిపించలేదు. దాంతో ఈ సినిమాలో అసలు ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఒక పాటలో కనిపించలేదు అంటే ఆ సినిమాలో తన రోల్ చాలా తక్కువ సమయం ఉంది అని అర్థం. దీంతో ఈమె ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఈ సినిమాలో ఈమె లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: