వీరసింహారెడ్డి: మాములుగా ఉండదంటున్న మ్యూజిక్ డైరెక్టర్?

Purushottham Vinay
వీర సింహారెడ్డి : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ  'అఖండ' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు 'అఖండ' లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎప్పుడెప్పుడా అని ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూస్తున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇప్పుడు వీర సింహ రెడ్డి సినిమాతో కూడా అఖండ  మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలనుకుంటున్నాడు బాల కృష్ణ.ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా చిత్ర యూనిట్ షురూ చేయడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. 


ఇక ఈ సినిమాలో బాల కృష్ణ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో 'వీరసింహారెడ్డి' సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. గతంలో బాల కృష్ణతో 'అఖండ' సినిమాకు బ్లాస్టింగ్ అదిరిపోయే బీజీఎం అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మరోసారి బాక్సులు బద్దలుకొట్టేందుకు ఫుల్ గా రెడీ అయ్యాడు. వీరసింహారెడ్డి మూవీలో కూడా థమన్ తనదైన బీజీఎంతో సౌండ్ బాక్సులకు ఎసరుపెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి థమన్ సోషల్ మీడియా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా షేర్ చేశాడు. ''థియేటర్స్‌లో కలుద్దాం.. దుమ్ములేపుదాం.. ఈసారి థియేటర్స్.. ప్లీజ్ డోంట్ కంప్లైన్.. ప్రిపేర్ అవ్వండి'' అంటూ థమన్ పోస్ట్ షేర్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: