ఆ స్టార్ హీరో సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!?

Anilkumar
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. దాని అనంతరం త్రిబుల్ ఆర్  సినిమా సక్సెస్ తరువాత ఎప్పుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాజమౌళి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్న వార్త విన్న అనంతరం వీరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో మహేష్ తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ను మెప్పించేలా గ్లోబ్రాటింగ్ ఫిల్ంగా రూపొందించినట్లు తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాను ఫ్రాంచైజ్ మాదిరిగా డెవలప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపాడు. అంతేకాదు ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ ను కొనసాగిస్తూ ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ను కూడా రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమాకి సంబంధించిన అన్ని సీక్వెల్స్ లోను మహేష్ బాబు ని హీరోగా కనిపిస్తాడు అంటూ చెప్పాడు విజయేంద్రప్రసాద్.


 దీంతో పాటు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా తుది దశకు చేరుకుంది అని..ఈ కథకు తుది మెరువులు దిద్దుకున్నట్లు వెల్లడించాడు విజయేంద్ర ప్రసాద్. ఇదిలా ఉంటే మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానన్నట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 29వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏడాది పాటు డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: