బాలయ్యపై ఫ్యాన్స్ పెదవి విరుపు.. ఫ్యామిలీ హీరోని పట్టించుకోరా అంటూ?

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగిపోతుంది. అదే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్. ఇప్పటికే మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కాగా.. ఇక ఆహా నిర్వాహకులు ప్లాన్ చేసినట్లుగానే రెండవ సీజన్ కూడా అంతకుమించిన సక్సెస్ అందుకుంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు అటు ఎన్నో ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న స్టార్ హీరోలను తీసుకువచ్చి ఇక బాలయ్య తనదైన రీతిలో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇంకేముంది ఆక ఆ ఇంటర్వ్యూలను చూసేందుకు పిచ్చిపిచ్చిగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.


 దీంతో గత కొంతకాలం నుంచి కూడా ఆహా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇటీవల ప్రభాస్ బాలయ్యను గెస్ట్ గా పిలిచి బాహుబలి ఎపిసోడ్ పేరుతో ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేశారు. ఇక ఈరోజు మరో ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా వచ్చి ఈ షోలో కాసేపు సందడి చేశారు. అయితే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా పిలిచి ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ జరిపేస్తున్నారు. పవన్ ఎపిసోడ్ కి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలాంటి సమయంలో నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అవుతున్నారు. బాలయ్య తీరు అస్సలు నచ్చడం లేదు అంటూ కాస్త పెదవి విరుస్తున్నారు. దీని వెనక పెద్ద కారణమే ఉంది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కి ఎవరెవరో హీరోలను తీసుకువస్తున్నారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న తారక్ ను మాత్రం ఎందుకు పిలవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. మొదటి సీజన్లో వస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురయింది. ఇక ఇప్పుడు రెండవ సీజన్లో వస్తాడని ఆశలు పెట్టుకున్న ఎపిసోడ్లు పూర్తవుతున్నాయి కానీ తారక్ కు ఆహ్వానం మాత్రం అందడం లేదు.. దీంతో నందమూరి బాలకృష్ణ పై ఇష్టం ఉన్న తారక్ ను పిలవలేదని అసంతృప్తి మాత్రం నందమూరి అభిమానుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అన్నది మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: