
అనుపమ పరమేశ్వరన్ కు 2022 ఎండింగ్ లో "ఎదురుదెబ్బ" ?
వాటిలో ఒకటి చందు మొండేటి దర్శకత్వం వహించిన "కార్తికేయ 2" కాగా, మరొకటి సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ "18 పేజెస్". ఈ రెండూ కూడా ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు పండుగ చేసుకున్నాయి. ప్రస్తుతం "18 పేజెస్" థియేటర్ లో రన్ అవుతోంది. అంతా బాగానే ఈ సంవత్సరాన్ని హిట్ తో ముగించాలి అనుకున్న అనుపమకు చివర్లో షాక్ తగిలింది. నిన్న హాట్ స్టార్ లో విడుదలైన బట్టర్ ప్లై సినిమాలో అనుపమ గీత అనే పాత్రలో నటించింది. ఇందులో భూమిక చావ్లా , రావు రమేష్ , నిహాల్ కోదాటి మరియు ప్రవీణ్ లు నటించారు.
రిలీజ్ కు ముందు ఈ సినిమాపై అంచనాలు పెంచిన అనుపమ పరమేశ్వరన్ మాటలు... సినిమా చూశాక ఆ ఫీలింగ్ రాదు. పిల్లల కిడ్నప్ ద్వారా డబ్బులు గుంజే చిన్న గ్యాంగ్ బట్టర్ ప్లై నెక్స్ట్ అనే అపార్ట్మెంట్ లోనే పాగా వేసి వివిధ రకాల పనులలో సెటిల్ అయ్యి ఉంటారు. అయితే స్టోరీ లైన్ కొత్తగా అనిపించినా స్క్రీన్ ప్లే విసుగు తెప్పిస్తుంది. అనుపమ పిల్లల కోసం వెతికే సీన్ లలోనూ ఎటువంటి ఉత్కంఠను కలిగించలేకపోయాడు. అలా సినిమా మొత్తం నీరసంగా సాగుతుంది. దీనితో 2022 లో హ్యాట్రిక్ కొడుతుంది అని భావించిన అనుపమకు ఎదురుదెబ్బ తగిలింది. మరి కొత్త సంవత్సరాన్ని ఏ సినిమాతో మొదలు పెడుతుందో చూడాలి.