"వీర సింహారెడ్డి" యూఎస్ఏ ప్రీమియర్స్ కు మామూలు రెస్పాన్స్ రావడం లేదుగా..!

Pulgam Srinivas
బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీతో అదిరిపోయే విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహా రెడ్డి మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి.


ఆ అంచనాలకు తగినట్టుగానే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... ఆ ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోయాయి. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... దునియా విజయ్ విలన్ పాత్రలో నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.


ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం మూడు సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. అంతకు ముందుగానే ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ మూవీ యూఎస్ఏ ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ ప్రారంభం కూడా అయ్యాయి. ఈ ఫ్రీ సేల్స్ లో విరసింహారెడ్డి మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. 58 లోకేషన్ లలో ... 127 షో లతో ఈ మూవీ ని విడుదల చేయనుండగా ... ఇప్పటికే 2380 టికెట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: