వాల్తేరు వీరయ్య "పూనకాలు" పాట నుంచి ప్రోమో వైరల్..!

Divya
డైరెక్టర్ బాబి దర్శకత్వంలో.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో చిరంజీవి హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. రవితేజ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అంతేకాదు సినిమా నుంచి పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు ,టీజర్లు అన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ పాట పూనకాలు లోడింగ్ అనే పాటను డిసెంబర్ 30వ తేదీన అంటే ఈరోజు విడుదల చేయబోతున్నారు.  అయితే ఇందుకు సంబంధించి నిన్న ఈ సినిమా పాట ప్రోమోను వదలగా.. అది ఇప్పుడు భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.. "నే అడుగేస్తే భూగోళం బాద్దలే.. నే నడిచొస్తే మాస్ మహారాజా నే.. జజ్జనకరే జనారే నే చిందేస్తే పూనకాలే.." అంటూ సాగే ఈ పాట ప్రోమో తోనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.  అంతేకాదు ఈ పాట యువతకు పూనకాలు తెప్పిస్తోందని చెప్పవచ్చు.  ఒకవైపు చిరంజీవి.. మరొకవైపు రవితేజ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై స్టెప్పులు వేస్తుండడం చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవు.

ఇకపోతే ప్రోమో నే ఈ రేంజ్ లో పాపులర్ అయింది అంటే ఇక ఈరోజు సాయంత్రంలోపు ఈ సినిమా పాటను రిలీజ్ చేయబోతున్నారు చిత్రం యూనిట్.. మరి ఏ రేంజ్ లో ఈ పాట పాపులారిటీ దక్కించుకుంటుందో చూడాలి. ఒకవైపు చిరంజీవికి పోటీ ఇవ్వడానికి బాలకృష్ణ కూడా వీర సింహారెడ్డి సినిమాతో పోటీ పడబోతున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న విడుదల కాగా.. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. రెండు సినిమాలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: