అన్ స్టాపబుల్ 2 కు ఆ మూవీ యూనిట్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస మూవీ లతో బిజీగా ఉన్నప్పటికి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కొన్ని ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ లోకి కూడా వచ్చాయి. ఇప్పటివరకు అన్ స్టపబుల్ లో స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చిన ఎపిసోడ్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.


ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆహా నిర్వాహక బృందం ప్రభాస్ మరియు గోపీచంద్ లతో ఒక ఎపిసోడ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 30 వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా అన్ స్టాపబుల్ యూనిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక ఎపిసోడ్ షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన అదిరిపోయే క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.


తాజాగా బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని మైత్రి మూవీ బ్యానర్ వారు నిర్మించగా ... శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ లోపు వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ కూడా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఒక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: