పఠాన్ మూవీకి సర్వం సిద్ధం.. సంబరాల్లో అభిమానులు..!
అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా అన్నీ కూడా సద్దుమణిగాయని తెలుస్తోంది. 2023 జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన షారుక్ ఖాన్.. దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు . ముఖ్యంగా షారుక్ ఖాన్ - దీపిక పదుకొనే కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం.
ఇప్పటికే టీజర్ విడుదలై టీజర్ కూడా విశేష స్పందన పొందింది. పఠాన్ సినిమా విడుదల ఇంకా కేవలం 30 రోజులు మాత్రమే ఉండడంతో షారుఖ్ ఖాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ కి సంబంధించిన సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో షారుక్ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.