మై డియర్ వెంకీ.. పార్టీ ఎక్కడ? : చిరంజీవి

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు ఎలాంటి నెగటివిటీ లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు సాగిపోతున్న హీరో. అలాగే ఎక్కువ సక్సెస్ రేట్ వున్న తెలుగు హీరోగా కూడా వెంకీకి మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖల నుంచి ఎన్నో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విక్టరీనే తన టైటిల్ టాగ్ పేరుగా మార్చుకున్న వెంకీ మామ..టాలీవుడ్ లో ఎటువంటి కాంట్రవర్సి లేని ఏకైక హీరో. డిసెంబర్ 13న జన్మించిన వెంకటేష్ 1986లో 'కలియుగ పాండవులు' సినిమాలతో వెండితెర అరంగేట్రం చేశాడు. తన 36 ఏళ్ళ సినీ కెరీర్ లో వెంకటేష్.. మొత్తం 7 నంది అవార్డులు ఇంకా 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు.ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి కూడా వెంకీ మామతో ఒక చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. 



ముఖ్యంగా చిరు ఇంకా వెంకీ మధ్య స్నేహం అయితే అసలు అల్టిమేట్ అనే చెప్పాలి. దీంతో వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అందర్నీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.'మై డియర్ వెంకీ, హ్యాపీ బర్త్ డే. వేర్ ఈజ్ ది పార్టీ' అంటూ వెంకీ మామతో కలిసి దిగిన సెల్ఫీని చిరంజీవి షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వెంకీ ప్రస్తుతం తెలుగులో ఏ సినిమా కూడా చేయడం లేదు. హిందీలో కండల వీరుడు స్టార్ హీరో సల్మాల్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. ఇంకా అలాగే దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ లో 'రానా నాయుడు' అనే ఒక హిందీ వెబ్ సిరీస్ ని వెంకటేష్ చేస్తున్నాడు. ఈ రెండు కూడా వచ్చే ఏడాదే విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: