త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కి కూడా విపరీతమైన క్రేజ్ దక్కింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల నటనకి ప్రపంచవ్యాప్తంగా ఉండాల్సిన అభిమానులు ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. అయితే ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ ఆయన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ సగానికి పైగానే పూర్తి కావడం జరిగింది.
ఇక ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ చేయబోయే సినిమాలు కూడా ప్రకటించేసాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి మాత్రం ఎలాంటి కదలి కూడా లేదు. త్రిబుల్ ఆర్ సినిమా తరువాత నుండి ఆయన ఖాళీగానే ఉన్నారు. కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టుగా చాలా కాలం కిందట ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. దీంతో అభిమానులు అసలు ఎన్టీఆర్ కి సినిమాల మీద ఆసక్తి పోయిందా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నా ఒక వార్త ఇప్పుడు ఆయన అభిమానులను తెగ కంగారు పడుతున్నారు.అయితే కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళతో కలిసి ఒక సినిమా చేయనున్నాడు .ఇక ఈ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్ సినిమాలు మొదలు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదట. అంతేకాదు ఆయన వద్దకి ఈ ఏడాదిలోనే ఎంతో మంది స్టార్ డైరెక్టర్ కథలు చెప్పడానికి కూడా ఎన్టీఆర్ దగ్గరికి రావడం జరిగిందట. కానీ ఎన్టీఆర్ మాత్రం వాటికి ఒప్పుకోలేదు ప్రస్తుతం ఈ వార్త ఆయన ఫాన్స్ ని కలవరపెడుతుంది. అయితే ఎన్టీఆర్ దృష్టి ప్రస్తుతం రాజకీయాల వైపు మరలిందని అందుకే ఆయన సినిమాల మీద ఆసక్తి చూపడం లేదని వార్తలు సైతం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య ఎన్టీఆర్ బీజేపీ నాయకులను కలవడం వంటి వార్తలు సైతం వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంగేజ్ లో ఉన్నాడని ఆయనని హీరోగా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది..!!