ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమలు విడుదల యొక్క తేదీలు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. అయితే బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన విడుదల కాగా ఆ వెంటనే ఒక్కరోజు కూడా తేడా లేకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కాబోతుంది అని ఇప్పటికే అధికారిగా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవి సినిమాలే కాకుండా మరో రెండు తమిళ సినిమాలు కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అందులో సినిమా
జనవరి 11న విడుదల కాగా విజేతళపతి వారసుడు సినిమా 12న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇక అదే రోజున బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కానుంది .చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 13న విడుదల కానుంది అయితే మొదటి మూడు రోజులు సినిమాలు నిరాశపరిచితే ఆ తర్వాత రోజు రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాకు కలిసి వస్తుందని .ఒకవేళ వీర వీర సింహారెడ్డి సినిమా గనుక మంచి టాక్ అందుకుంటే వాల్తేరు వీరయ్య సినిమాకి అన్యాయం జరుగుతుంది అని. ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు .
ఇక వీర సింహారెడ్డి సినిమాని సాధ్యమైనంత వరకు అన్ని థియేటర్లలో విడుదల చేస్తారట. ఇక ఆ తర్వాత వచ్చే వాల్తేరు వీరయ్య సినిమాకు ఆ ఛాన్స్ ఉండదు. అయితే ఆ మూడు సినిమాలు విడుదల అయిన తరువాత థియేటర్లు దొరకడం చాలా కష్టం అని చెప్పాలి. అందుకే వాల్తేరు వీరయ్య సినిమాకు జనవరి 13న కాకుండా 11న రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. జనవరి 11న విడుదల చేసి ఉంటే వీకెండ్ కలిసి రావడంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా ఉంటాయి కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్ ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీంతో చిరంజీవి సినిమా ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అని మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు..!!