"హరిహర వీరమల్లు" సెట్స్ లో పవన్ తో హరీష్ శంకర్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. నిది అగర్వాల్ ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. మధ్య లో కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కూడా జరుగుతుంది.
 


ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీcగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" మూవీ సెట్స్ లో ఉండగా , డైరెక్టర్ హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ ను కలిశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 


ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరి శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిcవరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా గబ్బర్ సింగ్ మూవీ సూపర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: