టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ ది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య వర్మ సినిమాలపై కన్నా వివాదాల పైనే స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన ఎక్కువగా బయోపిక్ చిత్రాలు వాటితో పాటు విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా
పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తాను మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఎలాంటి సెటైర్స్ వెయ్యలేదు అని ఆయన చిరంజీవి సినిమాల గురించి ఏం మాట్లాడినా ఒక అభిమానిగానే మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. అయితే తాజాగా వర్మ మరోసారి మెగాస్టార్ రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ జెంటిల్మెన్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ చాలా పర్ఫెక్ట్ అంటూ రామ్ చరణ్ గురించి ఈయన మాట్లాడడం జరిగింది.
రాంచరణ్ ఎలాంటి గొడవలకు వెళ్లడు అని ఇలాంటి గొడవలు లేకుండా ఉండడం చాలా బోరింగ్ గా ఉంటుంది అని ఈయన చెప్పడం జరిగింది .అయితే సడన్గా రాంగోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి మాట్లాడడంతో మెగా ఫ్యాన్స్ వర్మ మాటలలో ఏదో తేడాగా ఉంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ అంటేనే కోపంతో ఊగిపోయే ఈయన మెగా ఫ్యామిలీ గురించి ఎందుకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే వర్మ వ్యవహారం ఏదో తేడాగా ఉంది అని ప్రస్తుతం నేటిజన్లో భావిస్తున్నారు. అయితే మొత్తానికి రామ్ చరణ్ గురించి రాంగోపాల్ వర్మ ఇలాంటి కామెంట్లు చేయడం సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైరల్ గా మారింది..!!