ట్రైలర్: విజువల్స్ తో అబ్బుర పరుస్తున్న నాగబంధం ట్రైలర్..!
అంతేకాకుండా అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దాగివున్న ఆ బ్రహ్మ కమలం పురాతన వస్తువును చేజిక్కించుకోవడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటాయి ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక రక్షకులు ఆ బ్రహ్మ కమలం ను ఎలా రక్షించుకుంటారు నాగబంధం చుట్టూ ఉన్న కథ ఏంటి అనేది ఈ సినిమా కథ అన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ అభిషేక్ నామా మరిచిపోయిన చరిత్ర సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ అని ఈ సినిమా కథకు జోడించి నెక్స్ట్ లెవెల్ లో ట్రైలర్ ని కట్ చేశారు. మేకర్స్ పెట్టిన భారీ బడ్జెట్ విజువల్స్ అన్ని కూడా చాలా కృత్రిమంగానే కనిపిస్తున్నాయి.
ట్రైలర్ లో చూపించిన అద్భుతమైన విజువల్స్ కూడా అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో నభానటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళి శర్మ తదితర నటీనటులు నటిస్తున్నారు. ఎస్ఐకే స్టూడియోస్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మైథాలజీ ఫాంటసీ మిస్టరీ ప్రేక్షకులకు ఈ సినిమా అద్భుతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ట్రైలర్ తో ఆకట్టుకున్న నాగబంధం సినిమా బిగ్ స్క్రీన్ పైన ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.