అందరినీ మెప్పించే యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామా 'మా ఇంటి బంగారం'

Chakravarthi Kalyan
విడుదల తేదీ : జూన్ 19, 2026
నటీనటులు : సమంత, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే గౌతమి,శ్రీముఖి తదితరులు
దర్శకత్వం : బి.వి. నందిని రెడ్డి
నిర్మాణం : రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు
సంగీతం : సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం : ఓం ప్రకాశ్ ISC
కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :-
స్వప్న (సమంత) లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ గ్రామంలోని సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వస్తోంది. పెద్ద కుటుంబం, పైగా కుటుంబ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉండటం ఆమెకు కష్టం అవుతుంది. ఈ క్రమంలో ఫ్యామిలీని ఆకట్టుకోవడానికి స్వప్న చాలా రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో స్వప్న గతానికి చెందిన వ్యక్తులు రావడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. కరుణ (గుల్షన్ దేవయ్య) అనే దుర్మార్గుడు ఆమె జీవితంతో ఆడుకుంటాడు. స్వప్న గతం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె భర్త, అలాగే ఆమె కుటుంబం ఎలా స్పందించింది? ఆమె జీవితంలో మళ్లీ ప్రవేశించిన గుల్షన్ దేవయ్యకు ఎలా ఎదురొడ్డి నిలిచింది? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
సమంత.. వన్ ఉమెన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి సమంత మెప్పించింది. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో సమంత చాలా బాగా నటించింది. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా సామ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య తన మార్క్ నటనతో మెప్పించాడు. తన నటన చాలా రియలిస్టిక్ గా ఉంది.

అదే విధంగా శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్ లతో పాటు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకురాలు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :
స్వప్న పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకురాలు ఇంకాస్త ట్రీట్మెంట్‌ బావుంటే అదిరిపోయేది. సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా..అక్కడక్కడ కాస్త బోర్‌ అనిపిస్తది.
అలాగే పక్కా మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :
టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో స్వప్న పాత్రతో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకురాలు డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నారు. ఇక నిర్మాతలుగా రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ఫైనల్‌గా :
‘మా ఇంటి బంగారం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంత నటన, గుల్షన్ దేవయ్య పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచాయి. సినిమా కూడా ఇంట్రెస్టింగ్ ప్లేతో ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. టేకింగ్ అండ్ మేకింగ్ లతో పాటు సామ్ అండ్ ఆమె ఫ్యామిలీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

రేటింగ్‌ : 3/5


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: