మాజీ భర్త పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్...!!

murali krishna
మలైకా ఆరోరా.. ఈ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రత్యేకం. నార్త్ టూ సౌత్ ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో వైరలవుతుంటుంది. సినిమా అప్డేట్స్ కంటే.. వ్యక్తిగత జీవితం గురించి పలు రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇక కొద్దిరోజులుగా మలైకా పెళ్లి..ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. తన ప్రియుడు అర్జున్ కపూర్‏తో త్వరలోనే ఏడడుగులు వేయనుందని.. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అంటూ పూకార్లు రావడంతో.. వీటిపై సీరియస్‏గానే స్పందించారు. ఈ రూమర్స్ గురించి సైలెంట్ గా ఉన్న మలైకా.. తాజాగా ఓ షోలో తన మాజీ భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. చిత్రనిర్మాత.. కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రశ్నించగా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మలైకా.
మలైకా అంటే ఏంజిల్.. కానీ నేను ఏంజిల్ కాదు.. డిజైనర్‏ను మాత్రమే అని చెప్పుకొచ్చింది. అలాగే తన మాజీ భర్త సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భా్జ్ ఖాన్ పై ప్రశంసలు కురిపించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే తాము విడిపోయినట్లు తెలిపింది. తమ మాజీ భర్త తనను ఓ వ్యక్తిగా మార్చాడని.. అతని వల్లే నేను ఈరోజు ఇలా ఉండటానికి తనే కారణమని.. నేను కూడా విభిన్నమైన విషయాలను కోరుకున్నానని.. జీవితం ఎక్కడో గాడి తప్పినట్లు నేను భావించాను. నేను మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా కొన్ని బంధాలను వదులుకోగలిగితే అలా చేయగలనని భావించాను అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే.. ఇటీవల తనకు జరిగిన ప్రమాదం గురించి ఓపెన్ అయ్యింది. మలైకా మాట్లాడుతూ… ‘ప్రమాదం సమయంలో నేను నా పిల్లలను చూడలేనని అనుకున్నాను. కానీ కొన్ని గంటల్లో నేను స్పృహలోకి వచ్చాను. ఆపరేషన్ తర్వాత నా కళ్ళు, ముందు ఉన్న వ్యక్తి అర్బాజ్. కాసేపటికి నేను నా గతానికి తిరిగి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో అర్బాజ్ నాతో ఉన్న తీరు. అది నా మనసుకి చేరింది’. విడాకులు తీసుకున్న సమయంలో తన కుమారుడు అర్హాన్‏కు చాలా మద్దతు వచ్చిందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: