నటి సుధ కి జరిగిన అవమానం...!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రలో నటించిన మెప్పించిన సుధ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సహాయనటిగా ఎన్నో చిత్రాల్లో నటించింది సుధ.  వెండితెర రంగుల ప్రపంచం అనుకుంటారు.. కానీ అక్కడ కూడా ఎన్నో అవమానాలు..ఛీత్కారాలు.. కష్టాలు ఉంటాయని పలు ఇంటర్వ్యూల్లో నటినటులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి సుధకు ఇండస్ట్రీలో ఓ దారుణమైన అవమానం జరినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళ ఇండస్ట్రీకి చెందిన నటి సుధ ఎక్కువగా తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కి తల్లి, వొదిన, అత్త పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 850 చిత్రాల్లో నటించింది. ఒక్క తెలుగు లోనే సుమారు 500 చిత్రాలకు పైగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్ధాల పాటు తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ తో తెలుగు లోకి అడుగు పెట్టిన ఆమె చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ లో వొదిన పాత్రతో అందరినీ కంటతడి పెట్టించింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాల్లో ఆమెకు ఛాన్సులు వచ్చాయి. అలాంటిది ఆమె సినీ జీవితంలో ఓ ఘోర అవమానం పొందినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు.
నటి సుధ మాట్లాడుతూ.. నేను తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఓ సాంగ్ షూటింగ్ నడుస్తుంది. ఆ సాంగ్ కి సుందరం మాస్టార్ కొరియోగ్రాఫర్. నాకు ఓ చిన్న స్టెప్ చెప్పారు.. కానీ ఆ స్టెప్ కరెక్ట్ గా వేయకపోవడంతో ఎక్కువ టేకులు తీసుకున్నాను.. దాంతొ ఆయన నాపై కోపంతో ఊగిపోతూ దర్శకులు, సహనటులు అందరూ ఉండగానే నీవ్వు దేనికి పనికిరావు అంటూ బూతులు తిడుతూ.. సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే మా అమ్మదగ్గరికి వెళ్లి చెప్పాను.. ఆమె నాకు ధైర్యం చెప్పి ఎప్పటికైనా ఆయనే నీ దగ్గరకు వచ్చి నీ సహాయం అడుగుతాడు అని అన్నారు.. నిజంగానే ఆ రోజు వచ్చింది.. అప్పుడు ఆయన చేసినదానికి పశ్చాతాపం వ్యక్తం చేశారు’ అని నటి సుధ అన్నారు. తన కెరీర్ లో ఇటాంటి అవమానాలు ఎన్నో జరిగాయని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: