సినీ ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలుగా వాస్తు ఉంటారు. కొంతమంది హీరోలుగా సక్సెస్ అవుతారు మరికొందరు కారు .ప్రస్తుతం హీరోలు ఒక్క సినిమా హిట్టు కొట్టడం అనేది చాలా గగనంగా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలో కూడా వరుసగా హిట్ లను సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్టును అందుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు .తాజాగా ఇప్పుడు ఒక ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఇలా హ్యాట్రిక్ లని దక్కించుకోవడం జరిగింది. దీంతో వారి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ హిట్ లను అందుకున్న స్టార్ హీరోలలో
ఎన్టీఆర్ నాని మరియు అడివి శేషు ఉన్నారని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది .అయితే హీరోలుగా రెండు సినిమాల హిట్లను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు మాత్రం ఆరు సినిమాలు వరుసగా సక్సెస్ అందుకున్నాయి. అయితే ఎన్టీఆర్ నటించిన దమ్ము ,రభస, వంటి సినిమాలు పరిచయం అయినప్పటికీ వాటి అనంతరం టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ వంటి సినిమాలతో వరుసగా ఆరు విజయాలను అందుకోవడం జరిగింది,
ఇక నాచురల్ స్టార్ నాని విషయానికొస్తే పైసా, జెండాపై కపిరాజు సినిమాలో ఫ్లాప్ లో అందుకున్నప్పటికీ వాటి అనంతరం ఎవడే సుబ్రహ్మణ్యం, బలే బలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ జెంటిల్మెన్ ,మజ్ను ,నేను లోకల్ వంటి సినిమాలతో వరుసగా హిట్ లను అందుకున్నాడు నాని. ఇక ఇద్దరి స్టార్ హీరోల అనంతరం మరో యంగ్ హీరో అడిగి శేషు కూడా మంచి విజయాలని అందుకున్నాడు. ఆయన నటించిన క్షణం గూఢచారి, ఎవరు ,అమ్మి తుమ్మి మేజర్ , హిట్ 2 వంటి వరుస సినిమాలతో విజయాలను అందుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇలా వరుస సినిమాలతో వరుస హిట్ లను అందుకున్న జాబితాలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఉండడంతో వీరి అభిమానులు ఆనందపడుతున్నారు..!!