ఆ స్టార్ హీరోనే నమ్ముకున్న పూరీ జగన్నాథ్..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్  డైరెక్టర్ గా  మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈయనకి బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పాలి .ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ సినిమా తర్వాత పూరి  డైరెక్షన్ లో వచ్చిన ఇజం ,మెహబూబా సినిమాలో ఘోరంగా నిరాశ పరిచాయి. వీటితోపాటు ఈ మధ్యనే రామ్ పోతినేని తో తీసిన ఇస్మార్ట్  శంకర్ మూవీ కాస్త పర్వాలేదనిపించుకుంది .ఆ తరువాత వచ్చిన రొమాంటిక్ మూవీ మళ్లీ ఫ్లాప్ అయ్యింది.

ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో 
పూరి డైరెక్షన్లో నటించేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా  ఆర్థికంగా  భారీ నష్టాలను సంతరించుకుంది. ఇక ఆ నష్టాలను భర్తీ చేయాలంటే పూరి జగన్నాథ్ మళ్లీ ఒక మంచి సినిమా తీయాలి. అయితే ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ ఆయన కెరియర్ మొదట్లో తనకు లైఫ్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి .వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకి స్పెషల్ ఫాన్స్ ఉన్నారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ,ఇడియట్ ,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే ,దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలో ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .అయితే ఒక్క దేవుడు చేసిన మనుషులు సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ను సాధించాయి అని చెప్పాలి .ప్రస్తుతం పూరి ఉన్న ఈ పరిస్థితుల్లో మంచి కామ్ బాక్ ఇవ్వాలంటే తనకు లైఫ్ ఇచ్చిన రవితేజ తోనే అని భావిస్తున్నారట ఇక ఈ సినిమా తీసే ప్లాన్లో ఉన్నారట పూరి జగన్నాథ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: