BiggBoss6: ఆదిరెడ్డి మాములోడు కాదు.. ఏకంగా హీరోకే షాక్ ఇచ్చాడు..?

Anilkumar
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది .అయితే ఈ కార్యక్రమంలో విజేతగా ఎవరు నిలుస్తారని చర్చలు జరుగుతున్నాయి .సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదల అవుతున్న లేదా విడుదల అయిన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల కోసం బుల్లితెర కార్యక్రమాలలో సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. ఈ నేపద్యంలో నే హిట్ 2  సినిమా ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న  హీరో బిగ్ బాస్ షోలో సందడి చేయడం జరిగింది .ఈ క్రమంలోనే నాగర్జున కంటెస్టెంట్లతో మాట్లాడుతూ కోడిపుర్రే అని మిర్రర్ పై రాసి పైన కపాలం బొమ్మను వేయడం జరుగుతుంది .

ఇలా వేసిన తర్వాత హీరోని వేదిక పైకి పిలిచి అది ఎవరు వేశారో కనుక్కోమని నాగార్జున చెప్పడం జరుగుతుంది. స్టేజ్ పైకి వచ్చిన హెట్టు 2 హీరో అడివి శేషు ఇది ఎవరు వేశారు అనేది కనుక్కోవడం కోసం చిన్న లాజిక్ ఉపయోగించారూ.. ఈ క్రమంలోనే అందరినీ లేచి నిలబడమని హీరో చెప్పడం జరుగుతుంది. వారి హైట్ ను బట్టి బొమ్మ గీసింది ఎవరో తెలుసుకుంటానని ఆయన చెప్పడం జరిగింది .బొమ్మ బాగా హైట్ లో లేదు కాబట్టి కొంచెం పొట్టిగా ఉన్నవారే ఆ బొమ్మను గీసి ఉంటారని హీరో గెస్ చేస్తాడు.   హౌస్ లోనే కంటెస్టెంట్ రోహిత్ ...కొంచెం బెండ్ అయ్యి కూడా బొమ్మను గీయచ్చు కదా అంటూ చెప్తాడు...  

రోహిత్ ఇలా చెప్పడంతో ఆదిరెడ్డి ని  నువ్వే వేసావు కదా అని ప్రశ్నించారు అనంతరం హీరో అడవి శేషు నువ్వే వేసావు కదా అంటే దానికి సమానంగా ఆదిరెడ్డి అది మీరే కనుక్కోవాలి సార్ అంటూ నాగార్జున ముందే హీరో అడవి శేషుకి చిన్న షాక్ ఇస్తాడు.. ఇది విన్న నాగార్జున కూడా కరెక్టే కదా అని ఆదిని సమర్థించడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆదిరెడ్డి మాములోడు కాదు ఏకంగా హీరోకి కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: