గ్రాండ్ గా గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథి ఎవరంటే..?

Divya
మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా కలిసి నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగశేకర దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉండే కథాకథలతో రూపొందింది ఈ చిత్రం. నాగ శేఖర మూవీస్ బ్యానర్ , మణికంఠ ఎంటర్టైన్మెంట్, వేదాక్షర ఫిలిమ్స్ బ్యానర్స్ పై భావన రవి , నాగ శేఖర్, రామారావు చింతపల్లి , ఎంఎస్ రెడ్డి, చిన్నబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గడిపిన కొన్ని విషయాలను ఎప్పటికీ మర్చిపోరు. ముఖ్యంగా కాలేజీ, టీనేజ్, మొదట లవ్, ఆ తర్వాత వచ్చే యూత్ ఫుల్ లో జరిగే పలు సంఘటనలు జీవితాంతం గుర్తుకొస్తూనే ఉంటాయి.
ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకు గుర్తు చేసే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్.  డిసెంబర్ 9వ తేదీన ఘనంగా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్లు విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై కొత్త బజ్ ఏర్పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరపడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు చిత్రబృందం.. ఇకపోతే ఈరోజు హైదరాబాదులో సాయంత్రం ఘనంగా 6 గంటలకు గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించబోతున్నారు.
ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హిట్ 2 హీరో అడవి శేష్ హాజరు కాబోతున్నారు. ఇటీవలే ఈయన హిట్ 2 సినిమాతో భారీ విషయాన్నీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. మరొకవైపు మేజర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల హిట్ -2 సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు. గుర్తుందా సీతాకాలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అడవి శేష్ రాబోతుండడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: