మహేష్ అలా అనగానే కన్నీళ్లు వచ్చాయి... అడివి శేష్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో క్షణం , గూడాచారి , ఎవరు , మేజర్ తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో వరుస విజయాలను అందుకుంటూ సినిమా సినిమాకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు హీరోగా తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మించాడు.

మీనాక్షి చౌదరి మూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అడవి శేషు తాజాగా సోషల్ మీడియా వేదికగా నేటిజన్ లతో ముచ్చటించాడు. అందులో భాగంగా మహేష్ బాబు తో మీరు ఒక ద్రిల్లింగ్ స్టోరీ చేయాలి అంటూ ఓ నెటిజన్ అడవి శేషు ను అడిగాడు. దానితో అడవి శేషు ఈ రోజు ఉదయమే మహేష్ బాబు గారితో ఫోన్ లో చాలా సేపు మాట్లాడాను. నా విషయంలో చాలా గర్వంగా ఉన్నట్లు మహేష్ బాబు చెప్పారు. ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చాయి. బ్రదర్ గా ఎప్పటికీ తోడుంటానని ఆయనకు మాటిచ్చా. హిట్ ది సెకండ్ కేస్ మూవీ చూపించాలని ఆశగా ఎదురు చూస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చాడు అని అడవి శేష్ తాజాగా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: