టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమాకు ఆయన కేవలం నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ద్వారా ఆయనకు కమర్షియల్ హీరోగా మంచి పేరు రావడం జరిగింది.. అయితే ఈ సినిమా అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమా సినిమాకు అంతకంతకు ఎదిగి మంచి పేరును సంపాదించుకున్నాడు..
అయితే నాలుగు లక్షలతో మొదలైన ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందన్నమాట.. అయితే టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలే కాకుండా యాడ్స్ కి కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. ఇక ఎన్టీఆర్ రెమ్యూనరేషన్తో పాటు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా అంచనాలకు మించిన బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు స్క్రిప్ట్ విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ...అంతేకాదు హీరోయిన్లు టెక్నీషియన్ల విషయంలో
ఈయన ఆచి తూచి వ్యవహరిస్తున్నారట..ఇది ఇలా ఉంటే ఇక ఎన్టీఆర్ కు జోడిగా ఆయన సినిమాలో నటించే హీరోయిన్లకు సంబంధించి అనేకమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక తారక్ కి జోడిగా జాన్వి కపూర్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి..ఇదిలావుంటే ఇక తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాను పూర్తి చేసిన తర్వాత ఎవరి దర్శకత్వంలో నటిస్తారో చూడాల్సి ఉంది. కాగా పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడంపై తారక్ దృష్టి పెడుతున్నారు.. కాగా ఎన్టీఆర్ తదుపరి చిత్రాల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..!!