మధ్యలోనే ఆగిపోతున్న ఎన్టీఆర్ సినిమాలు..ఎందుకు..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఆర్.ఆర్.ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్… తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే విషయం పై క్లారిటీ వచ్చింది కానీ ఏ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడం లేదు.ఇక  ఆర్.ఆర్.ఆర్ సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ తో సినిమా అని అనౌన్స్మెంట్ వచ్చింది.కాగా  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీ రూపొందాల్సి ఉంది. కానీ  ఇక ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్…

మహేష్ తో సినిమా చేస్తున్నాడు.ఇదిలావుంటే ఇక ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఇదిలా ఉండగా.. ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నప్పుడే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ప్రశాంత్ నీల్ … ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టాడు. అదే సలార్. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ .. ఇద్దరూ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు. అయితే దీంతో కొరటాల శివ.. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.కాగా ఎన్టీఆర్ 30 వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నాడు అని అధికారిక ప్రకటన వచ్చింది.

కానీ ఇంకా ఈ కాంబో లో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఇకపోతే  దీంతో బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి.అయితే  ఇది నిజమే అని బుచ్చిబాబు టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక ఏమైందో ఏమో మరో ఆర్.ఆర్.ఆర్ హీరో అయిన రాంచరణ్ తో బుచ్చిబాబు సినిమా సెట్ అయ్యింది.అయితే  సడెన్ గా బుచ్చిబాబు ని ఎన్టీఆర్ ఎందుకు పక్కన పెట్టాడు అనే విషయం పై చర్చ జరుగుతుంది.ఇదిలావుంటే ఇక  మరోపక్క కొరటాల శివ స్క్రిప్ట్ ను కూడా ఎన్టీఆర్ ఫైనల్ చేయలేదు.అయితే  దీంతో ఫైనల్ గా కొరటాల శివ దర్శకత్వంలో అయినా ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? లేక వేరే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అయితే  మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: