"హిట్ 2" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీతో దర్శకుడిగా కెరియర్ జు మొదలుపెట్టిన శైలేష్ కొలను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిట్ 1 మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఇదే మూవీని శైలిష్ కొలను హిందీలో తెరకెక్కించాడు.  కానీ ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో , శైలేష్ కొలను ఈ మూవీ కి సీక్వెల్ గా హిట్ 2 మూవీ ని తెరకెక్కించాడు.

ఈ మూవీ లో అడవి శేషు హీరోగా నటించగా , మీనాక్షి చౌదరి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను క్లోజ్ చేసింది. ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 4 కోట్లు .
సీడెడ్ : 1.75 కోట్లు .
ఆంధ్ర : 4.50 కోట్లు .
మొత్తంగా హిట్ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 1.50 కోట్లు .
ఓవర్ సీస్ లో : 2.50 కోట్లు .
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా హిట్ 2 మూవీ 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగనుంది.  ప్రపంచవ్యాప్తంగా హిట్ 2 మూవీ 15 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: